సీఎం కేసీఆర్‌ను అసెంబ్లీలో నిలదీస్తా

సీఎం కేసీఆర్‌ను అసెంబ్లీలో నిలదీస్తా

హుస్నాబాద్: ఫిబ్రవరి రెండోవారంలో గౌరవెల్లి ప్రాజెక్ట్ నుంచి ప్రగతి భవన్ కు పాదయాత్ర చేస్తానన్నారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. ప్రగతి భవన్‌ కు వెళ్లి సీఎం కేసీఆర్‌ కు నిర్వాసితుల సమస్యలు విన్నవిస్తామని తెలిపారు. గురువారం గౌరవెల్లిలో భూనిర్వాసితులతో ఆయన మాట్లాడారు. ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితుల సమస్యలపై సీఎం కేసీఆర్‌ను అసెంబ్లీలో నిలదీస్తామని చెప్పారు.  కమీషన్ల కోసమే కేసీఆర్ ప్రాజెక్టుల రీడిజైన్ చేశారని ఆరోపించారు. నిర్వాసితులపై  పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడం అమానుషమని.. ఓట్ల కోసమే దళితబంధు పథకాన్ని తీసుకువచ్చి హుజురాబాద్ ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రభుత్వం ఎత్తివేసిందన్నారు.