సీఎం‌ కేసీఆర్ వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం

సీఎం‌ కేసీఆర్ వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం

మంత్రి కేటీఆర్కు తొందరెక్కువైందని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్. టీఆర్ఎస్ పునాదులు కదులుతున్నాయన్న ఆందోళన ఆయనలో స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. సీఎం కేసీఆర్ వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని రఘునందన్ ఆరోపించారు. 290 టీఎంసీల నీటి వినియోగానికి అంగీకరిస్తూ కేసీఆర్ సంతకం పెట్టిన విషయం కేటీఆర్కు తెలియకపోవడం హాస్యాస్పదం అన్నారు. వాస్తవాలు బయటకు రాకూడదన్న ఉద్దేశంతోనే రిటైరైన అధికారుల్ని ఇంకా పదవుల్లో కొనసాగిస్తున్నారని విమర్శించారు. నదీ జలాల పంపకంపై ప్రతినిధుల బృందాన్ని ఏర్పాటు చేయకుండా కేసీఆర్ ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని, సుప్రీంకోర్టుకు వెళ్లడం వల్లే కృష్ణా నదీ జలాల పంపకాల్లో జాప్యం జరుగుతోందని రఘునందన్ ఆరోపించారు.

24 గంటలు ఉచిత కరెంటు ఇస్తామన్న హామీ ఏమైందని రఘునందన్ ప్రశ్నించారు. గజ్వేల్, సిద్ధిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో మినహా రాష్ట్రంలో మరెక్కడా 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. రైతుల డిమాండ్ మేరకు రాత్రి పూట కూడా కరెంటు ఇవ్వాల్సి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఉచిక కరెంట్ పై క్షేత్రస్థాయి వాస్తవాలు భిన్నంగా ఉన్నాయని, దీనిపై టీఆర్ఎస్ పెద్దలు చర్చకు రావాలని రఘునందన్ డిమాండ్ చేశారు. 

For more news..

ప్రయాణికులకు మరోసారి షాకిచ్చిన టీఎస్ఆర్టీసీ 

కింగ్ కోఠి ప్యాలెస్ స్వాధీనం కోసం దాడులు చేస్తుండ్రు