కింగ్ కోఠి ప్యాలెస్  కోసం దాడులు చేస్తుండ్రు

కింగ్ కోఠి ప్యాలెస్  కోసం దాడులు చేస్తుండ్రు
  • ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్

హైదరాబాద్: కింగ్ కోఠి ప్యాలెస్ వివాదం వెనకు అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. సుమారు వందేళ్ల చరిత్ర ఉన్న కింగ్ కోఠి ప్యాలెస్ తమదంటే తమదంటూ రెండు సంస్థలు గొడవ పడుతుండడాన్ని ఆయన ప్రస్తావించారు. హెరిటేజ్ బిల్డింగ్స్ లిస్ట్ లో ఉన్న ఈ భవనాన్ని కమర్షియల్ కాంప్లెక్స్ గా మార్చడానికి ఐరిష్ కంపెనీ ప్లాన్ చేస్తోంది. అయితే ఈ వివాదం వెనక టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. గుండాలను పంపించి, దాడులు చేసి కింగ్ కోఠి ప్యాలెస్ ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కింగ్ కోఠి ప్యాలెస్ గురించి ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం పట్టించుకోవడంలేదంటూ దాసోజు శ్రవణ్ ట్విట్ చేశారు. 

 

 

 

 

 

ఇవి కూడా చదవండి

హనుమాన్ శోభాయాత్రకు భారీ బందోబస్తు

ఈశ్వరప్పను అరెస్ట్ చేయాల్సిందే

ధనుష్ క్లాప్తో ఆశిష్ కొత్త మూవీ

మనిషి మరణించినా బతికుండేది ఎప్పుడంటే..