టీకాలు ఇమ్మంటే కేసీఆర్ సర్కార్ తమాషా చేస్తోంది

V6 Velugu Posted on Jun 04, 2021

హైదరాబాద్: వ్యాక్సిన్‌లు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం తమాషా చేస్తోందని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మండిపడ్డారు. మున్సిపల్ సిబ్బంది వ్యాక్సిన్ అర్హుల ఫోటోలు తీసుకుని ఎస్ఎంఎస్ వచ్చిన తర్వాత వ్యాక్సిన్ సెంటర్‌‌కు వెళ్తే ప్రజలను లోపలికి రానివ్వడం లేదని ఆరోపించారు. వ్యాక్సినేషన్ విషయంలో గోషామహల్ నియోజకవర్గంలో ఒక రకంగా.. ఎంఐఎం నేతల నియోజకవర్గంలో మరో రకంగా అధికారులు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. 

‘ఎంఐఎం నియోజకవర్గాల్లోని ఆ పార్టీ ఆఫీస్‌లకు వెళ్లి వ్యాక్సిన్ టోకెన్‌‌లు ఇచ్చారు. వ్యాక్సినేషన్ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కానీ ఇతర నియోజకవర్గాలను మాత్రం పట్టించుకోవడం లేదు. జీహెచ్ఎంసీ కమిషనర్ గోషామహల్ నియోజకవర్గానికి రావాలి. ఇక్కడి వాస్తవాలేంటో తెలుసుకోవాలి. ప్రజలను ఇబ్బందులు పెట్టొద్దు’ అని రాజా సింగ్ పేర్కొన్నారు. 

Tagged Telangana, MLA Raja singh, Vaccination, MIM party, KCR government, goshamahal

Latest Videos

Subscribe Now

More News