కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు.. బీజేపీ ప్రభుత్వం వస్తుంది : గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్

కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు.. బీజేపీ ప్రభుత్వం వస్తుంది : గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్
  • కాంగ్రెస్ అధికారంలోఉండేది ఏడాదే
  • అప్పులు పూడ్చడంతోనే కాంగ్రెస్ కు సరిపోతుుంది
  • రాజ్యాంగాన్ని మారుస్తా అన్న కేసీఆర్ నే ప్రజలే మార్చేశారు

కాంగ్రెస్ అధికారంలో ఉండేది ఏడాదే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది ఏడాదే మాత్రమేనని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఆ పార్టీ ఎక్కువ రోజులు ప్రభుత్వాన్ని నడపలేదని వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ , ఛత్తీస్ గఢ్ లో బీజేపీ గెలిచిందని పేర్కొన్నారు. భారత రాజ్యాం గాన్ని మారుస్తా అన్న కేసీఆర్ నే తెలంగాణ ప్రజలే మార్చేశారని ఎద్దేవా చేశారు.ఇవాళ బీజేపీ రాష్టట్ర కార్యాలయంలో డా. బీఆర్. అంబేద్కర్ వర్ధధంతి కార్యక్రమంలో రాజాసింగ్ పాల్గొ న్నారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.  

ఈ సందర్భభంగా మాట్లాడిన రాజాసింగ్.. కేసీఆర్ అప్పులు చేసి వెళ్లారు. అప్పులు పూడ్చ డంతోనే కాంగ్రెస్ నాయ కులకు సరిపోతుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు ఎలా అమలు చేస్తారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీ పార్టీతోనే సాధ్యయం అవుతుుంది. ఒక్క ఏడాది మాత్రమే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వవం ఉంటుుం ది. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వవం అధికారంలోకి వస్తుుంది. అని రాజాసింగ్ అన్నారు. దళితులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ నిలబెట్టుకోలేదని ఆయన మండిపడ్డారు. 8 మంది ఎమ్మెల్యే లను గెలిపించిన తెలంగాణ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.