బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై హైకోర్టులో విచారణ

బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై హైకోర్టులో విచారణ

సస్పెన్షన్ గురైన బీజేపీ ఎమ్మెల్యేల పిటిషన్ పై హైకోర్టులో విచారణ చేపట్టింది. బీజేపీ ఎమ్మెల్యేల తరఫున లాయర్ దేశాయ్ ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపించారు. అసెంబ్లీ స్పీకర్ నిబంధనలు పాటించకుండా బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెన్షన్ చేశారన్నారు. సభా గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించినప్పుడు మాత్రమే సస్పెండ్ చేయాలని.. కానీ అలా జరగలేదన్నారు. ప్రొసీడింగ్స్ కాపీ ఎక్కడా అని బీజేపీ ఎమ్మెల్యేల తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది కోర్టు. అయితే ప్రొసీడింగ్స్ కాపీ ఇవ్వడానికి కుదరని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోర్టు తెలిపారు. దీంతో అసెంబ్లీ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది హైకోర్టు. ప్రొసీడింగ్స్ కాపీపై వివరణ ఇవ్వాలని అసెంబ్లీ సెక్రెటరీని ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది కోర్టు. 

మరిన్ని వార్తల కోసం:

కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు ప్రభుత్వం గుడ్న్యూస్

మాకు రాజకీయాలంటే పెద్ద టాస్క్

 

రాష్ట్రంలో ఉద్యోగాల ఖాళీలు.. శాఖలు, జిల్లాల వారీగా