లాలూకు లడ్డూలు పంచిన ఆర్జేడీ ఎమ్మెల్యేలు

లాలూకు లడ్డూలు పంచిన ఆర్జేడీ ఎమ్మెల్యేలు

బీహార్ అసెంబ్లీలో హైడ్రామా జరిగింది. అసెంబ్లీ ఆవరణలో ఆర్జేడీ, బీజేపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. జాబ్స్ ఫర్ ల్యాండ్ స్కామ్ కేసులో లాలూ యాదవ్, రబ్రీ దేవి, మిసా భారతిలకు బెయిల్ వచ్చిన నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలకు ఆర్జేడీ ఎమ్మెల్యేలు మిఠాయిలు పంచారు. దీంతో రాష్ట్రీయ జనతాదళ్, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఆర్జేడీ ఎమ్మెల్యేలతో గొడవకు దిగారు. ఆర్జేడీ ఎమ్మెల్యేలు స్వీట్లను ఇచ్చే నెపంతో బీజేపీ ఎమ్మెల్యేల వైపు  విసిరికొట్టారు. ఈ ఘటనతో ఆగ్రహించిన బీజేపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలు తెలియజేశారు. 

‘ఆర్జేడీ ఎమ్మెల్యేలకు అసెంబ్లోలో మర్యద ఇచ్చాం. వాళ్లు మాట్లాడుతుంటే ఊరుకున్నాం. కానీ, బయటికి వచ్చి మాపై గూండాగిరి చూపిస్తున్నారు. విషయంపై గవర్నర్ కు కంప్లెయింట్ చేస్తాం’అని విజయ్ కుమార్ సిన్హా అన్నారు.