టీఆర్ఎస్ కార్యకర్తల దాడిపై పోలీసులకు అర్వింద్ తల్లి ఫిర్యాదు

 టీఆర్ఎస్ కార్యకర్తల దాడిపై పోలీసులకు అర్వింద్ తల్లి ఫిర్యాదు

టీఆర్ఎస్ కార్యకర్తల దాడిపై బంజారాహిల్స్ పోలీసులకు ఎంపీ అర్వింద్ తల్లి విజయలక్ష్మీ ఫిర్యాదు చేశారు. 50 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు తమ ఇంటిపై దాడి చేశారని తెలిపారు. సెక్యూరిటీ గార్డ్, ఇంటి పనిమనిషిపై దాడి చేసినట్లు వివరించారు. కారు, ఇంట్లో ఫర్నిచర్, పూలకుండీలు, దేవుడి ఫొటోలు ధ్వంసం చేసినట్లు చెప్పారు. 

అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి

ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటి వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. ఆయన ఇంటిపై దాడికి తెగబడ్డారు. ఎమ్మెల్సీ కవితపై అర్వింద్ వివాదాస్పద వ్యాఖ్యలకు చేశారంటూ రెచ్చిపోయారు. బంజారాహిల్స్ లోని అర్వింద్ నివాసంలోకి చొరబడ్డ టీఆర్ఎస్ కార్యకర్తలు కిటికీల అద్దాలు పగులగొట్టారు. ఆయన ఇంటి ముందు దిష్టిబొమ్మ  దహనం చేశారు.