లెక్చరర్లకు జీతాలు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు

లెక్చరర్లకు జీతాలు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు

హైదరాబాద్: కార్పొరేట్ కాలేజీలపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. లెక్చరర్లకు జీతాలు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. టీచర్లు, లెక్చరర్లకు బీజేపీ అండగా ఉంటుందని, వారి సమస్యల కోసం పోరాడుతామన్నారు.

‘మీ కాలేజీలు నడుస్తున్నాయంటే అది లెక్చరర్ల కారణంగానే. లెక్చరర్లు క్యాన్వసింగ్ చేయకపోతే మీ కాలేజీల్లో అడ్మిషన్‌‌‌లు ఎక్కడివి? చాలా కాలేజీలు నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తున్నాయి. చరిత్రను తవ్వే పరిస్థితి తీసుకురావొద్దని ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలను హెచ్చరిస్తున్నా. బీజేపీ సంగతి మీకు తెల్వదు. టీచర్లు, లెక్చరర్లు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు. సమస్యలపై సంఘటితంగా పోరాటం చేయాలి. పిరికితనం వద్దు. బీజేపీ నేతలు ప్రజల కోసం పోరాటం చేస్తూ జైళ్లకు వెళ్తున్నారు. ఇప్పటికే నలుగురు జిల్లా అధ్యక్షులు జైల్‌‌కు పోయారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎంత దూరమైనా వెళ్తాం. ఎన్నిసార్లైనా అరెస్ట్ అవుతాం. ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలు ఇతర పార్టీలను కొన్నట్లుగా బీజేపీని కొనలేరు. వచ్చే mlc ఎన్నికలలో TRSకు బుద్ధి చెప్పండి’ అని సంజయ్ పిలుపునిచ్చారు.