
సీఎం కేసీఆర్ పాలనలో విద్యావ్యవస్థ నాశనం అయ్యేలా ఉందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల అభ్యర్ధనలను పూర్తిగా విస్మరించి, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. విద్యార్థుల 14 డిమాండ్ లను ప్రభుత్వం ముందుంచితే వాటిని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సిల్లీగా ఉన్నాయనడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్ని్ంచారు. మంత్రి ఇలా అనడం విద్యావ్యవస్థపై అమెకున్న చిత్తశుద్దికి నిదర్శనమని మండిపడ్డారు. విద్యార్థుల డిమాండ్లు సిల్లీగా ఎందుకు అనిపించాయో చెప్పాలని అర్వింద్ మంత్రి సబితను ప్రశ్నించారు. సబిత భర్త ఇంద్రారెడ్డి కమిట్ మెంట్ తో రాజకీయాలు చేసిన వ్యక్తి అని, కానీ సబిత దొరల పార్టీలో చేరి ఓ బానిసగా మారిందని అర్వింద్ ఆరోపించారు. మరోవైపు కేసీఆర్ పైన అర్వింద్ విమర్శలు చేశారు. ఎన్నో రాష్ట్రాలు తిరుగుతున్న కేసీఆర్ కు వందల మంది విద్యార్ధులు ఆందోళన చేస్తుంటే వారిని ఒక్కసారి కలిస్తే తప్పేందని ప్రశ్నించారు. వాళ్లు తెలంగాణలో లేరా అని నిలదీశారు.