ప్రపంచ దేశాల నేతలకు బాస్‌లా మారిన మోడీ.. ఐదో బలమైన దేశంగా భారత్

ప్రపంచ దేశాల నేతలకు బాస్‌లా మారిన మోడీ.. ఐదో బలమైన దేశంగా భారత్

ప్రపంచ దేశాల నేతలకు బాస్‌లా మోడీ మారారని అన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు. 2014లో బలహీనమైన దేశాల జాబితాలో భారత్ ఉండేదని…మోడీ నాయకత్వంలో ప్రపంచంలో ఐదవ బలమైన దేశంగా ఎదిగిందని తెలిపారు. నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ళ పాలన సుభిక్షంగా సాగిందన్న ఆయన.. ఆరున్నర దశాబ్దాలలో భారతదేశంలో ఎన్నో  అద్భుత విజయాలను మోడీ ప్రభుత్వం సాధించిందని తెలిపారు. కరోనా సమయంలో ఆత్మ నిర్భర భారత్ ద్వారా మన సత్తా చూపించామన్న ఆయన  ప్రపంచానికి మేడ్ ఇన్ ఇండియా వాక్సిన్ అందించామని గుర్తుచేశారు.

వంద దేశాలకు కోవిడ్ మందులు అందించాం..

మొబైల్ ఫోన్ ల తయారీ లో ప్రపంచంలో రెండవ దేశంగా భారత్‌ ఎదిగిందన్నారు జీవీఎల్.. కోవిడ్ సమయంలో వంద దేశాలకు మందులు అందించిన ఘనత మోడీ ప్రభుత్వానిదేనన్నారు జీవీఎల్. రెండున్నరేళ్లలో పార్లమెంట్ ఉభయ సభల భవనాలను నిర్మించిన చరిత్ర మోడీ నాయకత్వనిది.. పది కోట్ల మందికి ఉచితం గా గ్యాస్ కనెక్షన్ లు ఇచ్చాం.. రాబోయే ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీ ఖాయం అన్నారు.. 

తీవ్రవాద చొరబాట్లను అరికట్టాం

తీవ్రవాద చొరబాట్లు దాడులను  మోడీ ప్రభుత్వం అరికట్టిందని జీవీఎల్ తెలిపారు.తొమ్మిదేళ్ళ లో 74 కొత్త ఐర్పోట్ లను నిర్మించి... 55 వేల కోట్ల రూపాయల నరెగ నిధులను ఆంధ్ర ప్రదేశ్ కు ఇచ్చాం.. 22 లక్షల ఇళ్లు మంజూరు చేయడం జరిగింది.చారిత్రాత్మక పార్లమెంట్ భవన ప్రారంభానికి రాజకీయ పార్టీల నేతలు రాక పోవడం వాళ్ళ సంకుచిత మనసును తెలియ జేస్తుందని మండిపడ్డారు బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు.