Kangana Ranaut: రాజకీయాలకంటే సినిమాలు బెటర్.. ఎంపీ కంగనా కామెంట్స్ వైరల్

Kangana Ranaut: రాజకీయాలకంటే సినిమాలు బెటర్.. ఎంపీ కంగనా కామెంట్స్ వైరల్

బీజేపీ ఎంపీ కంగనా రనౌత్(Kangana Ranaut) షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజకీయాలకన్నా సినిమాలు బెటర్ అన్నారు. ఇటీవల ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న ఆమె ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఎంపీగా గెలిచిన తరువాత ఆమె ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ నుండి ఎంపీగా గెలిచారు హీరోయిన్ కంగనా రనౌత్. హిమాచల్ ప్రదేశ్ మండి నియోజకవర్గం నుండి పోటీచేసిన ఆమె మంచి మెజారిటీతో విజయం సాధించారు. అనంతరం.. త్వరలోనే ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలను కంప్లీట్ చేస్తానని, ఇకనుండి తన మొత్తం సమయాన్ని ప్రజాసేవకే వినియోగిస్తానని చెప్పుకొచ్చారు. ఈ మధ్యే ఆమె ఓ పాడ్ కాస్ట్ పాల్గొన్నారు.

ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి రమ్మని నాకు పిలుపు రావడం కొత్తేమీ కాదు. నా మొదటి సినిమా నుండే నాకు ఆహ్వానాలు వచ్చాయి. మా తాతయ్య ఇప్పటికే మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టే పదేపదే పాలిటిక్స్‌లోకి రమ్మని ఆహ్వానించేవారు. రాజకీయాలపై ఆసక్తి లేకుంటే ఇంత కష్టపడి ఇక్కడిదాకా వచ్చేదాన్ని కాదు. ఎప్పుడు కూడా నాకు నచ్చిందే నేను చేస్తూ వచ్చాను. రాజకీలాయంటే అంత ఈజీ కాదు. నాయుకుడు అంటే డాక్టర్ లా. ప్రజలకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండాలి. అందుకే రాజాకీలకంటే సినిమాలు బెటర్. అక్కడ ఒక సినిమా పూర్తవగానే రిలాక్స్ అవ్వొచ్చు. కానీ, ఇక్కడ అలా కాదు.. ప్రతీక్షణం ప్రజలకోసం ఆలోచేస్తూ ఉండాలి.. అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు కంగనా. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.