
బీజేపీ కర్ణాటక ఎంపీ, యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్విసూర్య పై కేసు నమోదు చేశారు పోలీసులు. తమ అనుమతి లేకుండా బీజేపీ నేతలు సభ నిర్వహించారని ఉస్మానియా రిజిస్ట్రార్ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు తేజస్వీ సూర్యతో పాటు మరి కొంతమందిపై ఐపీసీ 447 సెక్షన్ తో పాటు హైదరాబాద్ సీపీ యాక్ట్ 21/76 కింద కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసులపై బీజేపీ యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్విసూర్య స్పందించారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. మీరెన్ని చేసినా బీజేపీ గెలుపును ఆపలేరన్నారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల గెలుపుపై ప్రజలు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారన్నారు తేజస్వి.