సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి : నాగం వర్షిత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి : నాగం వర్షిత్ రెడ్డి
  •     నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి 

నల్గొండ, వెలుగు: ఓవైసీ బ్రదర్స్ మెప్పు కోసం హిందూ దేవుళ్లను కించపరిస్తే ఊరుకునేది  లేదని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి  డిమాండ్ చేశారు. సీఎం హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్రం లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  ఈ రాష్ట్రంలో హిందువులను హిందూ దేవుళ్లను అడుగడుగునా అవమానిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నాయకులకి తగిన బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు. ఒక వర్గం మెప్పు కోసం మైనారిటీల ఓట్ల కోసం ఒక సీఎం హోదాలో ఉండి సీఎం రేవంత్ రెడ్డి హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడం చాలా బాధాకరమని తెలిపారు.

 జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్ల విద్యాసాగర్ పట్టణ అధ్యక్షుడు గడ్డం మహేష్ మాజీ కౌన్సిలర్ కంకణాల నాగిరెడ్డి జిల్లా కౌన్సిల్ మెంబర్ బిపంగి జగ్జీవన్,  టూ టౌన్ ప్రధాన కార్యదర్శి కటకం శ్రీధర్,  మంగినపల్లి కిషన్ దాసరి కృష్ణ,  బిపంగి వినోద్,  ఏరుకొండ హరి,  తదితరులు పాల్గొన్నారు.