
పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పర్యటించారు. ధర్మారం మండలం గోపాల్ రావు పేటలో జరుగుతున్న లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని యాదవ కులస్తులు వివేక్ వెంకటస్వామికి శాలువ కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ... తెలంగాణ ప్రజలు తమ సంస్కృతిని కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కాడే సూర్యనారయణ, ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు.