ఇంజినీరుగా రిటైరైనంక.. ‘గేట్’ ర్యాంక్

ఇంజినీరుగా రిటైరైనంక.. ‘గేట్’ ర్యాంక్

అనంతపురం: ఉన్నత చదువులకు వయసు అడ్డంకాదని నిరూపించాడో పెద్దాయన. పదవీ విరమణ చేసిన తర్వాత కూడా హయ్యర్ స్టడీస్ అభ్యసించేవారు కొందరే ఉంటారు. అలాంటి కోవకు చెందిన వారే అనంతపురానికి చెందిన వి.సత్యనారాయణ రెడ్డి. ఆయన వయసు ప్రస్తుతం 64. ఇంజినీరుగా ఉద్యోగ విరమణ చేసిన అనంతరం జేఎన్టీయూలో ఎంటెక్ చేశారు. గేట్ పరీక్షలో ఏకంగా జాతీయస్థాయిలో 140వ ర్యాంకు సాధించి ఔరా అనిపించుకున్నారు. పంచాయతీరాజ్ శాఖలో ఇంజినీరుగా 39 ఏళ్లపాటు సేవలందించిన సత్యనారాయణ.. డీఈఈగా 2018లో రిటైర్మెంట్ తీసుకున్నారు. 2019లో జేఎన్టీయూలో సివిల్ డిపార్టుమెంటులో ఎంటెక్ లో చేరి 2022లో పూర్తి చేశారు. 2022 గేట్ ఎగ్జామ్ లోని జియోమోటిక్స్ ఇంజినీరింగ్ పేపరులో 140వ ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుటుంబసభ్యులతో చర్చించి బాంబే లేదా రౌర్కెలాలోని ఐఐటీలో జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్), రిమోట్ సెన్సింగ్ కోర్సులో చేరాలని భావిస్తున్నట్లు వివరించారు. 

మరిన్ని వార్తల కోసం:

జూబ్లీహిల్స్ కారు ప్రమాదం కేసులో ట్విస్ట్

నిరుద్యోగులకు గుడ్ న్యూస్

‘జూనియర్‌‌‌‌’కు జంటగా శ్రీలీల