
నాగర్ కర్నూల్: కేసీఆర్ అహంకారానికి అధికారం తొడైందని MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాచరికపు వ్యవస్థ నిర్మాణం కోసం కేసీఆర్ పని చేస్తున్నాడని మంద కృష్ణ ఆరోపించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే అన్ని వర్గాల వారు హక్కులు పొందుతున్నారన్నారు. ప్రస్తుతం ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఏప్రిల్ 9న హైదరాబాద్ లో యుద్ధభేరి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి హాజరై ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు.