రెండ్రోజుల పాటు బీజేపీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్

రెండ్రోజుల పాటు బీజేపీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్

దేశ రాజధాని ఢిల్లీలో రేపట్నుంచి రెండు రోజుల పాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నారు. పీఎం మోడీ, హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో పాటు 350 మంది ప్రతినిధులు ఈ మీటింగ్కు హాజరుకానున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగంతో సభ ప్రారంభం కానుంది. 17న ప్రధాని మోడీ స్పీచ్తో సమావేశం ముగియనుంది.

ఎగ్జిక్యూటివ్ మీటింగ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలాన్ని పొడిగించే అవకాశం ఉంది. ఈ నెల 20న ఆయన పదవీ కాలం ముగియనుంది.  ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల వరకు ఆయనను అధ్యక్షుడిగా కంటిన్యూ చేసే ఛాన్సుంది. ఈ అంశంతో పాటు 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైనా జాతీయ కార్యవర్గం చర్చించనుంది. రాజకీయ, ఆర్థిక ప్రతిపాదనలతో పాటు జీ-20 సదస్సుకు సంబంధించిన కార్యక్రమాలు అందులో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తల భాగస్వామ్యంపై చర్చించే అవకాశముంది. దీంతో పాటు వచ్చే లోక్‌సభ ఎన్నికలకు రూట్‌మ్యాప్ సిద్ధం చేసే అవకాశం కనిపిస్తోంది.