బీజేపీ జాతీయ కార్యదర్శి బీఎల్ సంతోష్
సంతోష్‌తో తరుణ్‌చుగ్, వివేక్ వెంకటస్వామి, ఈటల భేటీ
న్యూఢిల్లీ, వెలుగు: బీజేపీ ఫోకస్ అంత తెలంగాణపైనే ఉందని, రానున్న రోజుల్లో మరింత దృష్టి సారిస్తామని ఆ పార్టీ నేషనల్ సెక్రటరీ (సంస్థాగత) బీఎల్ సంతోష్ అన్నారు. బుధవారం ఢిల్లీలో సంతోష్‌ను బీజేపీ స్టేట్ ఇన్చార్జ్ తరుణ్ చుగ్, స్టేట్ కోర్ కమిటీ మెంబర్ జి.వివేక్ వెంకట స్వామి, మాజీమంత్రి ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కలిశారు. అరగంట పాటు ఆయనతో సమావేశమైన వీరు బీజేపీలో ఈటల చేరిక, గ్రౌండ్ లెవల్లో పార్టీ బలోపేతంపై చర్చించినట్లు సమాచారం.
తెలంగాణలో ఏ ఎన్నికలైనా విపరీతమైన ధన ప్రవాహం ఉంటోందని సంతోష్ వారితో అన్నట్లు తెలిసింది. దక్షిణాదిలో కర్నాటక తర్వాత తెలంగాణలోనే బీజేపీ బలంగా ఉందన్నారు.
