
బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల 10న శ్రీకాళహస్తిలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసిన బీజేపీ ఏపీ అధ్యక్షుడు నడ్డా పర్యటనను విజయవంతం చేయాలని సోమువీర్రాజు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పోస్టర్ లో కేంద్ర ప్రభుత్వం శ్రీకాళహస్తిలో చేసిన అభివృద్దిని వివరించారు. ఈ నెల 10న జేపీ నడ్డా శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారని సోము వీర్రాజు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిదేళ్లలో చేసిన అభివృద్దిని నడ్డా వివరిస్తారని తెలిపారు.
శ్రీ కాళహస్తి అభివృద్ధి కోసం అమృత పథకాన్ని అమలు చేశారని సోము వీర్రాజు అన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడులో జాతీయ విద్యాసంస్ధలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. బీజేపీ హయాంలోనే శ్రీకాళహస్తి నుంచి నడికుడి వరకు రైల్వే మార్గం మంజూరయిందన్నారు. తిరుపతి.. శ్రీకాళహస్తి దేవస్థానాల మద్య ఆరు లైన్ల జాతీయ రహదారి నిర్మిస్తున్న విషయాన్ని సోమువీర్రాజు గుర్తుచేశారు. పోస్టర్ విడుదల కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.