నోవాటెల్లో కొనసాగుతున్న బీజేపీ కార్యవర్గ సమావేశాలు

నోవాటెల్లో కొనసాగుతున్న బీజేపీ కార్యవర్గ సమావేశాలు

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్​ లోని హెచ్ఐసీసీ నోవాటెల్ లో శనివారం సాయంత్రం ప్రారంభమయ్యాయి.  వీటిని ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభించారు.   ఈసందర్భంగా ప్రధాని మోడీని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్​ వెంకటస్వామి, కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి సత్కరించారు. ఈ సమావేశాల్లో కేంద్ర హోం మంత్రి అమిత్​ షా, ఇతర కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం వరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు కొనసాగనున్నాయి.