సమిష్టి కృషితో బీజేపీని అధికారంలోకి తెస్తాం

సమిష్టి కృషితో బీజేపీని అధికారంలోకి తెస్తాం

న్యూఢిల్లీ: రాష్ట్రంలో గెలిచి... మోడీకి కానుక ఇస్తామని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కే లక్ష్మణ్ అన్నారు. సోమవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని లక్ష్మణ్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తనకు రాజ్య సభ సభ్యుడిగా అవకాశం కల్పించినందుకు అమత్ షాకు ధన్యవాదాలు తెలిపినట్లు చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ విస్తరణ, దేశవ్యాప్తంగా ఓబీసీ మోర్చా చేపడుతున్న కార్యక్రమాలపై అమిత్ షాతో చర్చించినట్లు పేర్కొన్నారు. పార్టీ జాతీయ నాయకత్వం రాష్ట్రంపై దృష్టి పెట్టిందని, ఇందులో భాగంగానే హైదరాబాద్ లో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నామని, దీనికి మోడీ, అమిత్ షా హాజరవుతారని చెప్పారు. పార్టీలో కొత్తగా చేరినవారికి తగిన ప్రాధాన్యమిస్తున్నామన్న ఆయన... సమిష్టిగా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు. త్వరలోనే  రాష్ట్రంలోని సర్పంచులు, ఎంపిటీసీలు, ఇతర ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పార్టీలో జాయిన్ కానున్నట్లు లక్ష్మణ్ తెలిపారు.