సీఎం ఇంట్ల మనవడు ఒక్కడే ఖాళీగా ఉండు

సీఎం ఇంట్ల మనవడు ఒక్కడే ఖాళీగా ఉండు

కేంద్ర నిధులను పక్కదారి పట్టించి.. తిరిగి కేంద్రంపైనే నిందలు వేయడం టీఆర్ఎస్ కే చెల్లిందన్నారు బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్. నిధులిచ్చిన సర్కారుపైనే నిందలు వేయడం కరెక్ట్ కాదన్నారు. మున్సిపల్ మంత్రి గా కేటీఆర్ ఫెయిల్ అయ్యారని… గుంతలు లేని రోడ్డు చూపించాకే మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడగాలన్నారు. మజ్లిస్ తో కలిసి ఇంటర్నేషనల్ సిటీని స్లమ్ సిటీగా టీఆర్ఎస్ మార్చిందని ఢిల్లీలో అన్నారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులపై తాను చర్చకు సిద్ధమన్నారు.

హైదరాబాద్ లో ఒక్క డబుల్ బెడ్ రూమ్ కట్టలేదన్నారు. ఇద్దరు తండ్రి కొడుకులు కలిసి దోచుకుంటున్నారన్నారు.  తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కేంద్రం అదుకుంటుందన్నారు. వదర బాధితులకు కేంద్రం ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. మజ్లీస్ పార్టీ వరద సహాయ నిధులలో అవినీతి పాల్పడుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు.  సీఎం ఇంట్లో మనవడు హిమాన్షుకు తప్ప అందరికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. పరీక్షలో ఫెయిల్ అయిన కవితకు కూడా ఉద్యోగమిచ్చారన్నారు.