గుజరాత్‌లో ఏడోసారీ అధికారం దిశగా బీజేపీ

గుజరాత్‌లో ఏడోసారీ అధికారం దిశగా బీజేపీ

గుజరాత్ లో  బీజేపీ మరోసారి విజయం దిశగా అడుగులు వేస్తోంది. ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో వరుసగా ఏడోసారి  భారతీయ జనతా పార్టీ రికార్డు సృష్టించబోతుంది. కౌంటింగ్ ప్రారంభమైన నుంచి లీడింగ్ కొనసాగిస్తూ బీజేపీ తన హవా కొనసాగిస్తోంది. గుజరాత్ లో బీజేపీ ఇప్పటివరకు 158 స్థానాల్లో లీడింగ్ లో ఉండగా, కాంగ్రెస్ 20కి పైగా స్థానాల్లో, ఆప్ 7 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.  బీజేపీ ఆధిక్యంతో పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసకుంటున్నారు. ఎగ్జిట్ పోల్స్  అంచనాలను నిజం చేస్తూ కాంగ్రెస్, ఆప్ లను బీజేపీ వెనకకు నెట్టేసింది. దీంతో సర్వేలు చెప్పినట్టు కాంగ్రెస్, ఆప్ లకు ఈ సారి కూడా భంగపాటు తప్పనట్టే తెలుస్తోంది. అంతే కాకుండా ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్ కావడంతో అందరి దృష్టి ఆ రాష్ట్రంపైనే పడింది. 

గుజరాత్ లో 182 స్థానాలకు ఈ నెల 1,5 తేదీల్లో ఎన్నికలు జరిగాయి. ఇప్పటికే బీజేపీ అధికారంలో కొనసాగుతుండగా.. ఈ సారి 2017 ఎన్నికల్లో సాధించిన సీట్ల కంటే మరిన్ని స్థానాల్లో విజయం సాధించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అదే నమ్మకంతో ఈ సారి కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని కమలనాథులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.