ఇల్లు అలగ్గానే పండగ కాదనే సామెత తెలిసే ఉంటుంది. ఈ సామెత ఇప్పుడు బీహార్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి సరిగ్గా యాప్ట్ అవుతుందని అనుకోక తప్పదు. ఎందుకంటే.. ఇంకా ఫలితాలు రానేలేదు.. అప్పుడే బీజేపీ సంబరాలకు సమాయత్తం అవుతోంది. పక్కా గెలుపు మాదేనంటూ సెలబ్రేషన్స్ కోసం లడ్డూలు ఆర్డర్ చేసింది ఆ పార్టీ.
2025 నవంబర్ 11 న బీహార్ అసెంబ్లీ తుది దశ పోలింగ్ పూర్తైన విషయం తెలిసిందే. మొత్తం 243 సీట్లకు జరిగిన ఓటింగ్ లో ఆ రాష్ట్ర చరిత్రలోనే 1951 తర్వాత అత్యధికంగా 66.91 శాతం పోలింగ్ నమోదైంది.
అయితే పోలింగ్ ప్రక్రియ పూర్తయిన వెంటనే ప్రముఖ సర్వే సంస్థలన్నీ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ లో దాదాపు బీజేపీదే అధికారం అంటూ ప్రిడిక్షన్స్ ఇచ్చాయి. కొన్ని లోకల్ సంస్థలు భిన్నంగా ఇచ్చినప్పటికీ.. మెయిన్ స్ట్రీమ్ సర్వే సంస్థలు, ఛానెళ్లు బీజేపీదే అధికారం అని తేల్చేశాయి. అన్ని సర్వేల యావరేజ్ తో NDTV పోల్ ఆఫ్ ఎగ్జిట్ పోల్ ప్రకారం.. ఎన్డీఏ కూటమి 146 స్థానాలు గెలిచే అవకాశం ఉండగా.. మహాగట్బంధన్ 91 స్థానాలకు పరిమితం అవుతుందని ఎగ్జిట్స్ పోల్స్ యావరేజ్ ద్వారా తెలుస్తోంది.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ఆధారంగా ఇక బీహార్ లో అధికారం తమదేననే ధీమాలో ఉంది ఎన్డీఏ కూటమి. అందులో భాగంగా సెలబ్రేషన్స్ కోసం ఏకంగా 501 లడ్డూలకు ఆర్డర్ ఇచ్చింది బీహార్ బీజేపీ పార్టీ.
ఈ సందర్బంగా కౌంటింగ్ డే రోజు హోలీ, దసరా, దివాలి, ఈద్.. తదితర అన్ని పండుగలు సెలబ్రేట్ చేసుకుంటాం.. ఎందుకంటే ఎన్డీఏ అభివృద్ధికే ఓటర్లు మళ్లీ పట్టం కట్టారు.. అంటూ ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రిజల్ట్స్ రోజు లడ్డూలను ప్రసాదాల రూపంలో ప్రజలకు పంచిపెడతామని అంటున్నారు. లడ్డూలను నవంబర్ 14 రోజు డెలివర్ చేయాల్సిందిగా బీజేపీ నేతలు ఆర్డర్ ఇచ్చారని పాట్నాలోని స్వీట్స్ తయారు చేస్తున్న వ్యక్తి చెప్పాడు.
అయితే ఎగ్జిట్ పోల్స్ అంతా ట్రాష్ అని.. బీహార్ లో మహాగట్బంధన్ గెలుస్తుందని ఆర్జేడీ నేత, తేజస్వీ యాదవ్ అన్నారు. బీజేపీ అగ్రనేతల కనుసన్నలలో ఎగ్జిట్ పోల్స్ వచ్చాయని విమర్శించారు.
దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు దీనికి అనుకూలంగా స్పందిస్తుంటే.. మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. గెలిస్తే లడ్డూలు పంచుతారు.. ఓడితే అవే లడ్డూలను అమ్ముకుంటారు.. వీళ్ల మైండ్ సెట్ వేరు.. అంటూ ఒకరు కామెంట్ చేశారు. ఎలక్షన్ కమిషన్ మిషన్ సక్సెస్ అయ్యింది.. రిగ్గింగ్ లేకుండా వాళ్లు గెలవలేరు.. వోట్ చోర్.. అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. పంచాయత్ సీజన్ 4 రిపీట్ అవుతోందని కొందరు అంటన్నారు.
#WATCH | #BiharElections2025 | Ahead of the counting of votes on 14th November, BJP workers in Patna come together to prepare laddoos. They say that they are preparing 501 kg of laddoos. pic.twitter.com/mwmIpBGVsc
— ANI (@ANI) November 12, 2025
