బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం..రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చ

బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం..రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చ

బీజేపీ పార్లమెంటరీ బోర్డు  సమావేశం కొనసాగుతోంది. ప్రధాని మోడీ అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది. ఈ సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ప్రధానంగా చర్చించనున్నారు.  రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక  కోసం పలువురు కేంద్రమంత్రులు,ముగ్గురు ప్రధాన కార్యదర్శులతో పాటు 14మందితో బీజేపీ ఇప్పటికే ఒక కమిటీ ఏర్పాటు చేసింది. సమావేశంలో నిర్ణయం తర్వాత ఎన్టీఏ పక్షాలతో చర్చించి అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. కాగా ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు  పేరును బీజేపీ పరిశీలిస్తోందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

మరోవైపు విపక్షాల తరఫున యశ్వంత్ సిన్హా రాష్ట్రపతి ఎన్నిక బరిలోకి దిగనున్నారు. విపక్ష పార్టీల సమావేశంలో యశ్వంత్ సిన్హాను నిలబెట్టాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ప్రకటించారు.  విపక్షాల సమావేశానికి ముందే ఆయన టీఎంసీకి రాజీనామా చేశారు. ఇక ఈ నెల 27న ఉదయం 11.30 నిమిషాలకు ఆయన నామినేషన్ వేయనున్నారు.