నవంబర్ 1న బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు మీటింగ్..

నవంబర్ 1న  బీజేపీ పార్లమెంటరీ  పార్టీ బోర్డు మీటింగ్..

న్యూఢిల్లీ, వెలుగు: బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు బుధవారం భేటీ కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సమక్షంలో ఢిల్లీలోని పార్టీ హెడ్ ఆఫీసులో జరగనున్న ఈ మీటింగ్​లో పార్లమెంటరీ బోర్డు మెంబర్ కె.లక్ష్మణ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, నేషనల్ జనరల్ సెక్రటరీలు (ఆర్గనైజేషన్) బీఎల్ సంతోష్, బండి సంజయ్, తెలంగాణ స్టేట్ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, రాష్ట్ర పార్టీ, సంస్థాగత వ్యవహారాల ఇన్​చార్జీలు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ తదితరులు పాల్గోనున్నారు.

మొత్తం 119 స్థానాలకు గాను... ఫస్ట్ లిస్టులో 52, సెకండ్ లిస్ట్​లో ఒక స్థానానికి బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 66 స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై బుధవారం జరిగే మీటింగ్ లో కసరత్తు చేయనున్నారు. అలాగే జనసేనతో పొత్తుపైనా ఈ భేటీలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా జనసేనకు ఎన్ని సీట్లు కేటాయించాలని, ఏయే స్థానాలు ఇవ్వాలనే అంశంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.