సొంత పార్టీ నేతకే బీజేపీ నోటీసులు

సొంత పార్టీ నేతకే బీజేపీ నోటీసులు

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ జ‌‌‌‌‌‌‌‌యంత్ సిన్హాకు బీజేపీ పార్టీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఐదో విడత లోక్‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌భ ఎన్నిక‌‌‌‌‌‌‌‌ల్లో జ‌‌‌‌‌‌‌‌యంత్ సిన్హా త‌‌‌‌‌‌‌‌న ఓటు హ‌‌‌‌‌‌‌‌క్కును వినియోగించుకోలేదు. ఎన్నిక‌‌‌‌‌‌‌‌ల ప్రచారంలోనూ  పాల్గొన‌‌‌‌‌‌‌‌లేదు. దాంతో ఆయనపై పార్టీ సీరియస్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే షోకాజ్ నోటీసులు ఇష్యూ చేసింది. జార్ఖండ్‌‌‌‌‌‌‌‌లోని హజారీబాగ్ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయ‌‌‌‌‌‌‌‌డం లేద‌‌‌‌‌‌‌‌ని సిన్హా ప్రకటించారు. 

దాంతో ఆ సీటును మ‌‌‌‌‌‌‌‌నీశ్ జైస్వాల్‌‌‌‌‌‌‌‌ కు ఇస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది. కీల‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌మైన హజారీబాగ్ స్థానం నుంచి మ‌‌‌‌‌‌‌‌నీశ్ జైస్వాల్‌‌‌‌‌‌‌‌ను అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి జ‌‌‌‌‌‌‌‌యంత్ సిన్హా ఎన్నిక‌‌‌‌‌‌‌‌ల ప్రచారంలో పాల్గొన‌‌‌‌‌‌‌‌డం లేద‌‌‌‌‌‌‌‌ని, తన ఓటు కూడా ఆయన వేయ‌‌‌‌‌‌‌‌లేద‌‌‌‌‌‌‌‌ని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్య సాహు చెప్పారు. మీ ప్రవర్తన కారణంగా పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందని పేర్కొంటూ సిన్హాకు షోకాజ్ నోటీసు ద్వారా  తెలియజేశారు.