- నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారంటూ బీజేపీ కార్పొరేటర్ల నిరసన
- కౌన్సిల్హాల్లోకి చొచ్చుకెళ్లేందుకు పార్టీ లీడర్ల యత్నం, స్వల్ప ఉద్రిక్తత
- చర్యలు తీసుకోవాలని మేయర్ఆదేశాలు
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్రసాభాసగా సాగింది. మేయర్ ధర్ని మధుకర్ అధ్యక్షతన సోమవారం ఉదయం కౌన్సిల్ జనరల్ బాడీ మీటింగ్నిర్వహించారు. సమావేశం ప్రారంభం కాగానే బీజేపీ ప్లోర్ లీడర్ గాజుల ముఖేశ్ గౌడ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ కౌన్సిలర్లు బొట్ల అనిత, నాగరాజు వివిధ అజెండా అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తమ డివిజన్లలో తాము ప్రతిపాదించిన పనులు కాకుండా కాంగ్రెస్ లీడర్ల ప్రపోజల్స్‌కు ప్రాధాన్యం ఇస్తూ అజెండాలో ఎలా చేర్చారని ప్రశ్నించారు.
అజెండా అంశాలపై చర్చ తర్వాత ఇతర విషయాలపై చర్చించడానికి సమయం ఇస్తామని చెప్పినా వినిపించుకోలేదు. ఓవైపు వీరు నిరసన వ్యక్తం చేస్తుండగా, మరోవైపు మేయర్ ఆదేశాలతో అధికారులు ఎజెండా చదవడం స్టార్ట్చేశారు. బీజేపీ కార్పొరేటర్లను సస్పెండ్ చేస్తామని వార్నింగ్ఇచ్చారు. దీంతో బీజేపీ కార్పొరేటర్లు మీటింగ్‌ను బైకాట్ చేసి బయటకు వెళ్లారు. కాసేపటికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు గౌడ్ తదితరులు వచ్చి మేయర్, కమిషనర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కౌన్సిల్ హాల్‌వైపు దూసుకెళ్లారు.
వెంటనే మేయర్ పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ ప్రమోద్‌రావు వచ్చి బీజేపీ కార్పొరేటర్లను, నాయకులను బయటకు పంపించారు. ఈ క్రమంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనంతరం బీజేపీ నాయకులు నినాదాలు చేస్తూ మున్సిపల్‌ఆఫీసు నుంచి ఐబీ చౌరస్తాకు చేరుకొని అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలిపారు. అజెండాలో మొదటి అంశమైన స్వచ్ఛభారత్ నిధులకు సంబంధించి సమావేశంలో ప్రస్తావించకపోవడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు వాడుకుంటూ వాటి గురించి చర్చించకపోవడంపై తప్పుబట్టారు. కార్పొరేషన్ అవినీతిమయంగా మారిందని ఆరోపించారు. కాగా, సమావేశానికి అంతరాయం కలిగించినందుకు చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని మేయర్ ధర్ని మధుకర్కమిషనర్అన్వేశ్ను ఆదేశించారు.
పలు పనులకు ఆమోదం
కార్పొరేషన్ మీటింగ్‌లో వివిధ అభివృద్ధి పనులను ఆమోదించారు. మహాప్రస్థానంలో రూ.కోటితో సోలార్ప్లాంట్ఏర్పాటు, వాటర్ పైపులైన్రిపేర్లకు రూ.50 లక్షలు, వనమహోత్సవానికి రూ.50 లక్షలు, రోడ్లు, లైటింగ్‌తో పాటు వివిధ అభివృద్ధి పనులకు రూ.1.80 కోట్లు, కోతులను పట్టించేందుకు రూ.15 లక్షలు కేటాయించారు. కార్పొరేషన్ పరిధిలో కొత్తగా 120 మంది శానిటేషన్వర్కర్ల నియామకానికి ఆమోదం తెలిపారు. పలువురు కార్పొరేటర్లు తమ డివిజన్లలోని సమస్యలను విన్నవించగా, బీఆర్ఎస్కార్పొరేటర్లు నిధుల కేటాయింపులో అవకతవకలపై ప్రశ్నించారు.
