అర కిలోమీటర్ లో అడుగడుగునా గుంతలే

అర కిలోమీటర్ లో అడుగడుగునా గుంతలే

కాశీబుగ్గ, వెలుగు: హనుమాన్ గుడి జంక్షన్ నుంచి కోట వరకు వెళ్లే రహదారి అధ్వానంగా మారిందని, ఆ రహదారిలో అడుగడుగునా గుంతలు ఏర్పడ్డాయని బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం గుంతల్లో పూలు చల్లి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ స్టేట్ లీడర్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు మాట్లాడుతూ ఖిలా వరంగల్​లోని హనుమాన్ జంక్షన్ నుంచి కోట వరకు వెళ్లే రహదారిలో అర కిలోమీటర్ దూరంలోనే అరవైకిపైగా గుంతలు ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నిత్యం ఎంతో మంది ప్రయాణిస్తున్న ఈ రోడ్డు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్​చేశారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు కందిమల్ల మహేశ్, ఖిలా వరంగల్ మండల ఉపాధ్యక్షుడు నాండ్రే అమర్ నాథ్, మండల ప్రధాన కార్యదర్శి గొల్ల రాజుకుమార్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు బోలుగొడ్డు సతీశ్​ తదితరులున్నారు.