బీజేపీ అంటే ప్రాంతీయ పార్టీలకు భయం

బీజేపీ అంటే ప్రాంతీయ పార్టీలకు భయం

న్యూఢిల్లీ: మంత్రి కేటీఆర్ ప్రధాని మోడీపై హద్దు మీరి మాట్లాడారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్సింహా రావు మండిపడ్డారు. ప్రధాని మోడీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. బీజేపీ అంటే తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలకు భయం కలుగుతోందని, కేటీఆర్ వ్యాఖ్యలను చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతోందన్నారు. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకరిస్తున్నప్పటికీ... ఇలాంటి విమర్శలు చేయడం సరికాదన్నారు. మోడీ, బీజేపీ, కేంద్రాన్ని దూషిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే కేటీఆర్, నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పేపర్ యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చామన్నారు. కుటుంబ రాజకీయాల వల్ల ప్రజాస్వామ్యానికి పెద్ద ప్రమాదం పొంచి ఉందన్నారు. కాంగ్రెస్ లో ప్రశాంత్ కిషోర్ చేరికపై స్పందించిన ఆయన... టీఆర్ఎస్, వైసీపీలను పీకే కాంగ్రెస్ లో కలుపుతారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ లో పీకే చేరికతో బీజేపీకి వచ్చే నష్టమేమీలేదన్నారు. 

మరిన్ని వార్తల కోసం...

మద్యం తాగిన టీచ‌ర్ క్లాస్ రూమ్ లో ఏం చేశాడంటే..

ప్రోటోకాల్ వివాదంపై సీఎస్ కు రఘునందన్ రావు ఫిర్యాదు