
- బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి
ఎల్బీనగర్, వెలుగు: పార్టీ ఆదేశిస్తే మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి తెలిపారు. ఎల్బీనగర్ లోని బీజేపీ ఆఫీసులో శనివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సామ రంగారెడ్డి మాట్లాడుతూ.. 16 ఏండ్లుగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నట్లు చెప్పారు. 2019లో బీజేపీలో చేరినప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్నందున అధిష్టానం తనకు రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్ష బాధ్యతను అప్పగించిందన్నారు. 2020లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో ఎల్బీనగర్ సెగ్మెంట్లోని 11 డివిజన్లను బీజేపీ గెలిచిందన్నారు. అధిష్టానం అవకాశమిస్తే కచ్చితంగా మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా బరిలో దిగుతానన్నారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేత జక్కిడి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.