యూరియాను దారి మళ్లిస్తున్నరు : ఎంపీ లక్ష్మణ్‌‌‌‌

యూరియాను దారి మళ్లిస్తున్నరు : ఎంపీ లక్ష్మణ్‌‌‌‌
  • ఈ సమస్యకు రాష్ట్ర ప్రభుత్వమే కారణం: ఎంపీ లక్ష్మణ్‌‌‌‌ 

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో యూరియా కొరతకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శించారు. వ్యవసాయేతర పనులకు దారి మళ్లించడంతో యూరియా సమస్య తలెత్తిందని, ఇది సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి అసమర్థత పాలనకు నిదర్శమన్నారు. శుక్రవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో లక్ష్మణ్‌‌‌‌ మీడియాతో మాట్లాడారు. సర్కార్‌‌‌‌ తీరుతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు.