రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత, ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ను రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్ నుంచి ఆయన రాజ్యసభ ఎన్నికల బరిలో నిలుస్తారని పార్టీ జాతీయ ప్రధాన ప్రకటించింది. రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించడంతో లక్ష్మణ్ నివాసం సందడిగా మారింది. కార్యకర్తలు,నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక.. అంకితభావంతో పనిచేస్తే సాధారణ కార్యకర్తకు కూడా మంచి పదవులు వస్తాయనడానికి ఇదే నిదర్శనమన్నారు లక్ష్మణ్. పార్టీ తనకు ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నెరవేరుస్తానన్నారు.
50 శాతం ఉన్న బీసీలకు సరైన గుర్తింపునిచ్చారని, ఏనాడూ కూడా పార్టీల్లో పదవుల కోసం ఆశించలేదని, 45 సంవత్సరాలుగా పార్టీకి పని చేయడం జరుగుతోందని తెలిపారు. పార్టీ తనకు ఎన్నో పదవులు కట్టబెట్టిందని, తనకు రాజ్యసభ సీటు ఇవ్వడం ప్రజల గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సబ్ కా సాత్..సబ్ కా వికాస్ లక్ష్యంతో మోదీ పని చేస్తున్నారన్నారు. కలిసి పని చేస్తే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి బీజేపీ రావడం ఖాయమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నిరుద్యోగులు, యువకులు, అనేక మంది ఆహుతులైనట్లు.. ప్రజలు అన్నీ గమనిస్తున్నట్లు వెల్లడవించారు. ముషిరాబాద్ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు లక్ష్మణ్ తెలిపారు.
మరిన్ని వార్తల కోసం : -
స్వీపర్ కొడుకు.. ఇక కలెక్టర్
యూపీ నుంచి రాజ్యసభకు లక్ష్మణ్
