వెకిలి పోస్టులు పెట్టడానికి సిగ్గుండాలి

 వెకిలి పోస్టులు పెట్టడానికి సిగ్గుండాలి
  • బీజేపీ అధికార ప్రతినిధి రాణీ రుద్రమ

హైదరాబాద్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను అవమానించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని బీజేపీ అధికార ప్రతినిధి రాణీ రుద్రమ డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రిపై వెకిలి మాటలు మాట్లాడతారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ ప్రణాళిక సిద్ధం చేయలేని పల్లా, ఆరోగ్య శాఖపై పట్టులేని హరీశ్ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పై విమర్శలు చేయడమా ? అంటూ మండిపడ్డారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర మహిళా మంత్రినే గౌరవించని టీఆర్ఎస్ నేతలు రాష్ట్రంలోని మహిళలకు ఏమి రక్షణ కల్పిస్తారని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి సీతారామన్ పై వెకిలి పోస్టులు పెట్టడానికి సిగ్గుండాలని రాణీ రుద్రమ పేర్కొన్నారు.