ప్రైవేటు బడుల్లో ఫీజులను నియంత్రించాలి: రాణిరుద్రమ

ప్రైవేటు బడుల్లో ఫీజులను నియంత్రించాలి: రాణిరుద్రమ
  •     బీజేపీ అధికార ప్రతినిధి రాణిరుద్రమ డిమాండ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేటు విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రించాలని ప్రభుత్వాన్ని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ డిమాండ్ చేశారు. ఫీజు రెగ్యులేటరీ కమిటీని ఏర్పాటు చేస్తామని గతంలో కాంగ్రెస్ ప్రకటించినా ఇప్పటికీ కమిటీ వేయలేదన్నారు. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆమె మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి దగ్గరే విద్యాశాఖ ఉందన్నారు. చిన్న క్లాసులకూ రూ.3లక్షలు, 4 లక్షల ఫీజు వసూలు చేస్తున్నారని.. అయినా ఎందుకు వాటిని కంట్రోల్ చేయడం లేదని ప్రశ్నించారు. స్కూల్స్  నుంచి సర్కారుకు ఏమైనా కమీషన్లు వస్తున్నాయా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు బడుల్లో యూనిఫామ్స్, షూస్​ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారని తెలిపారు. 18 ఏండ్లు నిండిన విద్యార్థులకు స్కూటీలను ఇస్తామని చెప్పారని, ఇప్పటికీ ఆ ఊసే లేదన్నారు. 

జిల్లాలలో స్పోర్ట్స్ స్కూల్ నిర్మాణానికి కనీసం జాగా అయినా చూశారా?  అని ప్రశ్నించారు. బడుల్లో వేలాది టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా నింపడం లేదన్నారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఉచిత విద్యను అమలు చేయాలని డిమాండ్ చేశారు.