
హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ సునీల్ బన్సల్ మంగళవారం హైదరాబాద్‌కు రానున్నారు. రాష్ట్ర బీజేపీలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో సునీల్ బన్సల్ టూర్ కు ప్రాధాన్యత ఏర్పడింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తున్నారంటూ వార్తలు రావడం, మరోవైపు ఈ నెల 8న మోదీ వరంగల్ టూర్ ఉండడం, ఆ తర్వాత రోజు హైదరాబాద్ లో 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల మీటింగ్ ఉన్నందునా సునీల్ బన్సల్ నిర్వ హించనున్న సమావేశంపై ఆసక్తి నెల కొంది.
మోదీ టూర్ సక్సెస్ చే యడానికి, నడ్డా సమావేశానికి సం బంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర నేతలకు ఆయన దిశా నిర్దేశం చేయనున్నారు.