
చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరారు యువకులు. శనివారం (జులై 12) కోటపల్లి మండలంలోని వెలమపల్లి గ్రామానికి చెందిన సుమారు 50 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన యువకులకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి.
టూరిజం హబ్గా బాసర:
అంతకు ముందు బాసరలో రూ.9 కోట్లతో పునర్నిర్మించిన టీటీడీ అతిథి గృహాన్ని, రూ.3 కోట్లతో నిర్మించిన ఈవో ఆఫీస్ ను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి ప్రారంభించారు మంత్రి వివేక్. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి కేంద్రం వెయ్యి కోట్లు ఇవ్వాలని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. బాసరలో ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడారు. 'బాసరను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతాం. రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధి కోసం బీజేపీ ఎంపీ నగేశ్ కేంద్రంతో మాట్లాడి నిధుల మంజూరు చేయించాలి.
ఆలయాల్లో పని చేసే కార్మికుల సమస్యలను పరిష్కరించి కనీస వేతనాలు అమలు చేస్తం. భక్తుల కోసం అవసరమైన సౌకర్యాలు కల్పించి ఇబ్బందు లు లేకుండా చర్య లు తీసుకుంటాం. గిగ్ వర్కర్లకు భద్రత, కనీస వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటం. దీనిపై సీఎం రేపంతో మాట్లాడాను. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. నిధుల కొరత ఉన్నా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభిస్తున్నం.
గత ప్రభుత్వం అప్పులు అప్పజెప్పిన అభివృద్ది పనులు మాత్రం ఆపడం లేదు. రాజీవ్ ఆరోగ్యశ్రీ. ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత కరెంట్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్నబియ్యం రైతు భరోసా లాంటి పథకాలు అమలు చేస్తున్నం' అని తెలిపారు.