
ఇంగ్లాండ్ తో జరుగుతున్న లార్డ్స్ టెస్టులో టీమిండియా ఇంగ్లండ్ స్కోర్ ను సమం చేసి ఆల్ అవుట్ అయ్యింది. మూడో టెస్ట్ మూడో రోజు ఆటలో భాగంగా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 387 రన్స్ కు ఆలౌట్ అయ్యింది. జడేజా, వాషింగ్టన్ సుందర్ భాగస్వామ్యంలో ఎంతో కొంత లీడ్ ఇస్తారనుకున్నప్పటికీ.. జడేజా 72 రన్స్ దగ్గర అవుట్ అవ్వటంతో పెద్ద పాట్నర్షిప్ కు బ్రేక్ పడింది. 131 బంతుల్లో 72 రన్స్ కొట్టిన జడేజా.. క్రిస్ ఓక్స్ బౌలింగ్ లో జేమీ స్మిత్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత సుందర్ వాషింగ్టన్ సుందర్ 23 వ్యక్తిగత స్కోర్ దగ్గర ఔట్ కావడంతో ఇన్నింగ్స్ 387 పరుగుల వద్ద ముగిసింది.
అంతకు ముందు 4 వికెట్ల నష్టానికి 248 పరుగులతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ప్రారంభంలోనే రాహుల్ వికెట్ కోల్పోయింది. లంచ్ తర్వాత ఆర్చర్ బౌలింగ్ లో సింగిల్ తో సెంచరీ పూర్తి చేసుకున్న రాహుల్.. ఆ తర్వాత తాను ఎదుర్కొన బంతికే బషీర్ బౌలింగ్ లో స్లిప్ లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ దశలో జడేజా, నితీష్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. జాగ్రత్తగా ఆడుతూ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. టీ విరామం వరకు వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. టీ తర్వాత టీమిండియాకు స్టోక్స్ షాక్ ఇచ్చాడు. ఒక ఎక్స్ ట్రా బౌన్సర్ తో నితీష్ (29)ను వెనక్కి పంపాడు. దీంతో ఆరో వికెట్ కు 72 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది.
3 వికెట్ నష్టానికి 145 పరుగులతో మూడో రోజు తొలి సెషన్ ప్రారంభించిన టీమిండియా ఇంగ్లాండ్ బౌలర్లను సమర్ధవంతంగా అడ్డుకుంది. ఈ క్రమంలో పంత్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. రాహుల్ సెంచరీ దిశగా దూసుకెళ్లాడు. లంచ్ కు ముందు చివరి ఓవర్లో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. పంత్ రిస్కీ సింగిల్ తీసే ప్రయత్నంలో బెన్ స్టోక్స్ కొట్టిన ఒక అద్భుతమైన త్రో కారణంగా రనౌటయ్యాడు. దీంతో రాహుల్, పంత్ మధ్య 148 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది.
అంతకముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 112.3 ఓవర్లలో 387 రన్స్‌కు ఆలౌటైంది. జో రూట్ (104) సెంచరీ పూర్తి చేసుకోగా.. బ్రైడన్ కార్స్ (56), జేమీ స్మిత్ (51) ఫిఫ్టీలతో రాణించారు. బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ (2/85) రెండు వికెట్లు తీశాడు.