Bitchat: సరికొత్త మెసేజింగ్ యాప్..ఇంటర్నెట్,వైఫై, మొబైల్ డేటా అవసరంలేదు

Bitchat: సరికొత్త మెసేజింగ్ యాప్..ఇంటర్నెట్,వైఫై, మొబైల్ డేటా అవసరంలేదు

ట్విట్టర్(ప్రస్తుతం X) సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే సరికొత్త మెసేజింగ్ యాప్‌ బిట్ చాట్ (Bitchat)ను లాంచ్ చేశారు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇంటర్నెట్, వైఫై, మొబైల్ డేటా, ఫోన్ నంబర్, సర్వర్లు, యూజర్ ఐడీలు వంటివి ఏమీ అవసరం లేకుండానే పనిచేస్తుంది. ఇంటర్నెట్ అవసరం లేకుండా  బ్లూటూత్ ఆధారంగా ఈ యాప్ బ్లూటూత్ మెష్ నెట్‌వర్క్‌ను ఉపయోగించి పనిచేస్తుంది. అంటే మీ ఫోన్ బ్లూటూత్ ద్వారా సమీపంలోని ఇతర డివైజ్‌లకు కనెక్ట్ అయి మేసేజ్లను పంపుతుంది.

ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్: వాట్సాప్ మాదిరిగానే ఇందులో కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంటుంది. మీ చాట్ లు చాలా సురక్షితంగా ఉంటాయి. మేసేజ్ పంపిన వ్యక్తికి అందుకున్న వ్యక్తికి మాత్రమే అందుబాటులో ఉంటాయి. 

ప్రైవసీకి ప్రాధాన్యత: ఈ యాప్ యూజర్ల గోప్యతకు అధిక ప్రాధాన్యతనిస్తుంది. సర్వర్లు లేకపోవడం వల్ల డేటా లీకేజీ ప్రమాదం తగ్గుతుంది. ఈ యాప్ ద్వారా మీ ఐడెంటిటీని దాచిపెట్టి కూడా చాట్ చేయవచ్చు.ఇందులో తాత్కాలిక మేసేజ్ లు పంపడం, చాటింగ్ కోసం గ్రూపులను సృష్టించడం వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

►ALSO READ | Airtel కొత్త ఆఫర్: రూ.349 ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ 5G డేటా.. Jio, Viలకు షాక్!

లభ్యత: ఇది ప్రస్తుతం బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉంది. యాపిల్ టెస్ట్‌ఫ్లైట్ ప్లాట్‌ఫాం ద్వారా పరిమిత సంఖ్యలో iOS వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. సాధారణంగా మనం ఉపయోగించే మెసేజింగ్ యాప్‌లు ఇంటర్నెట్ లేకుండా పనిచేయవు. 

ఈ కొత్త బిట్ చాట్ యాప్ ఇంటర్నెట్ లేని ప్రదేశాల్లో లేదా ఏదైనా విపత్తు సమయంలో కమ్యూనికేట్ చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. జాక్ డోర్సే ఈ యాప్‌ను ఆఫ్‌లైన్ చాటింగ్ కోసం రూపొందించారు.