నిమజ్జన ఏర్పాట్లు చేయకుంటే ఏం చేయాలో మాకు తెలుసు

నిమజ్జన ఏర్పాట్లు చేయకుంటే ఏం చేయాలో మాకు తెలుసు

తక్షణమే వినాయక్ సాగర్ నిమజ్జన ఏర్పాట్లు చేయాలంటూ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హిందూ పండుగలంటే సీఎం కేసీఆర్ కు అంత చులకనా అని ప్రశ్నించారు. వెంటనే  నిమజ్జన ఏర్పాట్లు చేయాలని ..లేనిపక్షంలో ఏం చేయాలో తమకు తెలుసన్నారు. సర్కార్ తీరుకు నిరనసగా రేపు ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈమేరకు బండి సంజయ్ ఓ ప్రకటన విడుదల చేశారు. 

ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం జరుపుకునేలా ఏర్పాట్లు చేయాలంటూ ర్యాలీ చేసిన భాగ్యనగర్ ఉత్సవ సమితి నాయకులను అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. వినాయక సాగర్ వద్ద ఏర్పాట్లు చేయకపోతే హిందువులంతా గణేష్ నిమజ్జనం ఎక్కడ చేసుకోవాలని ప్రశ్నించారు.