
గతంలో ఏపీ ప్రజలను అవమానించిన కేసీఆర్ ఇప్పుడు ఏపీ అభివృద్ధికి గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని బండి సంజయ్ అన్నారు. అప్పట్లో ఏపీ వాళ్లు తయారు చేసిన బిర్యానిని పెండ బిర్యాని అన్నారన్నారు. వారి ఉలవచారును తెలంగాణలోని ఎడ్లు, బర్లు తింటాయన్నారని చెప్పారు. కేసీఆర్ మళ్లీ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
కేసీఆర్ ఏపీ ప్రజలను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తుండని బండి సంజయ్ అన్నారు. ఏపీ వ్యాపారులు ఇక్కడ ప్రశాంతంగా వ్యాపారం చేసుకునే పరిస్థితి లేదన్నారు. ఏపీ ప్రజలతో ఓట్లు వేయించుకుని తర్వాత వారిని పట్టించుకోడని చెప్పారు. ఏపీకి క్యాబ్లను పంపించి..బీఆర్ఎస్లో చేరేందుకు నేతలను పిలిపించుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్కు జాతీయాధ్యక్షుడే లేడని.. అటువంటిది ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు.