- ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రతిసారి అవినీతిపై మాట్లాడుతున్నారని, ఆయనే అవినీతి కింగ్అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ విమర్శించారు. సోమవారం కామారెడ్డిలో మీడియాతో మాట్లాడారు. రైతుల నుంచి సెస్ వసూలు చేసి డిగ్రీ కాలేజీ కోసం సేకరించిన భూములను ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీకి అప్పగించిన చరిత్ర ఎమ్మెల్యేకు ఉందన్నారు. గతంలో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే పోటీ నుంచి విత్‌డ్రా చేశారని ఆరోపించారు.
అభివృద్ధి కోసం కలిసి రావాలి..
కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి పార్టీలకు అతీతంగా కలిసి రావాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ పేర్కొన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీలో అత్యధిక సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పటికీ హంగ్ ఏర్పడిన దృష్ట్యా మద్దతు ఇవ్వడానికి బీఆర్ఎస్ ముందుకొచ్చిందన్నారు. ఎన్నికల వరకే పార్టీలు ఉండాలని తర్వాత అభివృద్ధికి సహకరించాలన్నారు. కరప్షన్ లేని మున్సిపాలిటీగా మార్చాలని పాలక వర్గానికి సూచించారు. కామారెడ్డి అభివృద్ధికి రూ.300 కోట్లు ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరానని చెప్పారు. మార్చి చివరి నాటికి పట్టణంలో తాగునీటి కష్టాలు తీరుతాయన్నారు. పైపులైన్ పనులతో పాటు ట్యాంక్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు. సమావేశంలో మున్సిపల్‌చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
