బండి సంజయ్ రోడ్డుపక్కన కారు ఆపి ఏం చేశారంటే..

బండి సంజయ్ రోడ్డుపక్కన కారు ఆపి ఏం చేశారంటే..

బండి సంజయ్ కుమార్... సింప్లిసిటీకి నిలువెత్తు నిదర్శనం.. తరచూ సింప్లిసిటీ ఈజ్ బెస్ట్ పాలసీ అని చెప్పడమే కాదు.. ఆచరణలో చూపెడుతున్నఅసలు సిసలైన ప్రజా నాయకుడు. తానో పెద్ద రాజకీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడే కాదు.. దేశంలో అత్యున్నత పార్లమెంటు చట్టసభ సభ్యుడన్న విషయం గాని.. హంగు ఆర్భాటం.. గాని డాబు దర్పం.. ఆయన వద్ద ఎక్కడా కనిపించవు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటూ.. సహాయం కోసం తన వద్దకు వచ్చిన వారికి ఏదో ఒకరీతిన ఊరట కలిగించి పంపే అలవాటు వల్ల అందరి తలలో నాలికలా వ్యవహరిస్తుంటారు.  ఇదే కోవలోనే సోమవారం మార్గం మధ్యలో రోడ్డు పక్కనున్న చిన్న టీ బండి దగ్గర ఆగి  చాయ్ తాగి వెళ్లడం ఆయనకే చెల్లింది. 
ఇవాళ హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండల పర్యటనకు బయలుదేరారు. మార్గమధ్యలో సిద్దిపేట సమీపంలో రోడ్డు పక్కనున్న ఒక చిన్న టీబండి దగ్గర ఆగి, సామాన్యుడిలా చాయ్ తాగారు. బండి సంజయ్ తో పాటు స్థానిక నాయకులూ ఉన్నారు. ఒకప్పుడు కేసీఆర్ ప్రాతినిధ్యం వహించిన కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సంజయ్ కుమార్ కనుసైగ చేస్తే అడుగులకు మడుగులొత్తేవారు కొల్లలు. స్టార్ హోటళ్లకు వెళ్లడం పెద్ద సమస్యేమీ కాదు. కానీ తను ఎంత పెద్ద నాయకుడైనా.. తనను తాను సామాన్య కార్యకర్తగా భావించుకోవడమే కాదు.. వ్యవహరించడమూ బండి సంజయ్ కుమార్ కే చెల్లింది. అనుకోని అతిథిలా వచ్చిన బండి సంజయ్ కుమార్ ను చూసి బండిపై టీ అమ్ముకునే చాయ్ వాలా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.