బీఆర్ఎస్ నేతలూ బీజేపీలో చేరండి .. ఆ పార్టీకి భవిష్యత్ లేదు : కిషన్ రెడ్డి

బీఆర్ఎస్ నేతలూ బీజేపీలో చేరండి ..  ఆ పార్టీకి భవిష్యత్ లేదు : కిషన్ రెడ్డి

ఢిల్లీ: తెలంగాణలో బీఆర్ఎస్ కు భవిష్యత్ లేదని, ఆ పార్టీ నేతలంతా తమ చేరాలని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్లు, సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు అంతా బీజేపీలో చేరాలని కోరారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా ఉందని, కనీసం గతంలో గెలిచినన్ని సీట్లు కూడా రావని అన్నారు. తమ పార్టీ రాష్ట్రంలో 17 సీట్లలో పోటీ చేస్తుందని, మెజార్టీ సీట్లలో విజయం సాధిస్తుందని చెప్పారు. 

పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ ను బీజేపీలో చేరాలని సంప్రదింపులు జరిపిందా అన్న విలేకరుల ప్రశ్నకు ఎవరైనా బీజేపీలో చేరతామంటే వద్దంటమా..? అంటూ దాటవేశార. రేపు పార్లమెంటరీ బోర్డు మీటింగ్ జరుగుతుందని, ఒక్కో సెగ్మెంట్ నుంచి నలురైదుగురి పేర్లను బోర్డు ముందుంచుతామని కిషన్ రెడ్డి చెప్పారు. వారిలో సరైన క్యాండిడేట్ ను కేంద్ర నాయకత్వం డిసైడ్  చేస్తుందని చెప్పారు. ఎన్నికల సమయంలో ఉత్తర, దక్షిణ భారత దేశాలు వేరు అనే మాటలు కొందరు మాట్లాడుతున్నారని అన్నారు. 

దేశమంతా ఒక్కటేననే నినాదంతో బీజేపీ ముందుకు సాగుతుందని చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాకే నూతన విద్యావిధానాన్ని అమల్లోకి తెచ్చామని, ప్రాంతీయ భాషల ప్రాధాన్యం పెంచామని చెప్పారు. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం అవినీతి మయంగా మారిందని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ మట్టికరవడం ఖాయమని చెప్పారు.