దేశ వ్యతిరేక శక్తులకు తగిన బుద్ధి చెప్పాలి : బీజేపీ స్టేట్ చీఫ్ ప్రెసిడెంట్ రాంచందర్ రావు 

దేశ వ్యతిరేక శక్తులకు తగిన బుద్ధి చెప్పాలి : బీజేపీ స్టేట్ చీఫ్ ప్రెసిడెంట్ రాంచందర్ రావు 
  • ఇండిపెండెన్స్​ డే వేడుకలో బీజేపీ స్టేట్ చీఫ్ ప్రెసిడెంట్ రాంచందర్​ రావు 

హైదరాబాద్, వెలుగు: దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు దేశ వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్నాయని, రైతులు, యువత ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అన్నారు. రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంపై తమకు విశ్వాసం ఉందని, దేశాన్ని అవమానించే ఇలాంటి శక్తులకు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని ఆయన సూచించారు.

శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో 79వ సాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను రాంచందర్ రావు ఆవిష్కరించారు. స్వాతంత్ర్యం కోసం భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. యువత వారి స్ఫూర్తితో దేశాభివృద్ధికి కృషి చేయాలని రాంచందర్​రావు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండి సంజయ్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కాసం వెంకటేశ్వర్లు, దుగ్యాల ప్రదీప్ కుమార్, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి,  ఎన్వీఎస్ఎస్​ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, సంకినేని వెంకటేశ్వరరావు, మహిళా మోర్చా ప్రెసిడెంట్ శిల్పారెడ్డి తదితరులు పాల్గొన్నారు.