లేబర్ కోర్టు తీర్పు వచ్చేదాకా ఆగమనడం సరైంది కాదు

లేబర్ కోర్టు తీర్పు వచ్చేదాకా ఆగమనడం సరైంది కాదు

ఆర్టీసీ కార్మికులు తిరిగి వారి విధుల్లో చేరేవిదంగా రాష్ట్ర ప్రభుత్వం న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా వ్యవహరించాలని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావ్ అన్నారు. వారిని విధుల్లోకి చేరకుండా లేబర్ కోర్టు తీర్పు వచ్చేదాకా ఎదురుచూడాలనడం, బెదిరింపు ధోరణికి గురి చేయడం అన్యాయమన్నారు.ఇలాంటి ధోరణిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు.

తమ సమ్మెను ముగించినట్లు అధికారికంగా ఆర్టీసీ ఉద్యోగసంఘాల ప్రకటించిన తరువాత కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న తీరును బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు కృష్ణసాగర్ .ఆర్టీసీ ఇంచార్జ్ ఎండి సునీల్ శర్మ విడుదల చేసిన ప్రకటన చూస్తే ముఖ్యమంత్రి కార్యాలయం..  ఉద్యోగులను విధులకు అనుమతించవద్దనే ఆలోచనలో ఉన్నట్టు స్పష్టమవుతోందని అన్నారు. ఇది సీఎం కేసీఆర్ మధ్యతరగతి ఉద్యోగుల పట్ల ప్రతీకార వైఖరిలా కనిపిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ బలహీనమైన , దురదృష్ట వంతులైన ఆర్టీసీ కార్మికులపై తన అధికార  బలాన్ని ప్రయోగించి ఇది తన విజయంగా ఆనందిస్తున్నాడన్నారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఓడించడంగా బీజేపీ భావిస్తుందని కృష్ణసాగర్ అన్నారు.

BJP state chief spokesman Krishnasagar Rao