బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఎప్పుడంటే?

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఎప్పుడంటే?
  • హాజరుకానున్న సునీల్ బన్సల్, తరుణ్ చుగ్

హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఈ నెల 23, 24న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరగనున్నాయి. ఆ పార్టీ రాష్ట్ర సంస్థాగత, రాజకీయ ఇన్​చార్జీలు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ ఈ సమావేశాలకు హాజరుకానున్నారు. స్టేట్  చీఫ్​ బండి సంజయ్ అధ్యక్షతన 23న ఆఫీస్ బేరర్ల మీటింగ్, 24న రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరుగనున్నాయి. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చించి, తీర్మానం చేయనున్నారు. వచ్చే నెల 5  నుంచి ప్రారంభమయ్యే 9 వేల కార్నర్ మీటింగ్​ల సక్సెస్, బైక్ ర్యాలీలు, పార్లమెంటరీ ప్రవాసీ యోజన ప్రోగ్రాంలు, బూత్ కమిటీల ఏర్పాటు, పార్టీ బలోపేతంపైనా చర్చించనున్నారు. ముందస్తు ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహం, కేసీఆర్ సర్కార్ ప్రజావ్యతిరేక విధానాలను జనంలో ఎండగట్టడం, కేంద్ర ప్రభుత్వ   స్కీమ్​లను ఇంటింటికి తీసుకెళ్లడం వంటి అంశాలపైనా డిస్కస్  చేయనున్నారు. సుమారు 250 మంది నేతలు పాల్గొననున్నారు.