కేసీఆర్ మేనిఫెస్టో అబద్ధాల మూట: తరుణ్ చుగ్

కేసీఆర్ మేనిఫెస్టో అబద్ధాల మూట: తరుణ్ చుగ్

న్యూఢిల్లీ, వెలుగు: కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టో  అబద్ధాల మూటలా ఉందని బీజేపీ రాష్ట్ర ఇన్​ చార్జ్, నేషనల్ జనరల్ సెక్రటరీ తరుణ్ చుగ్ విమర్శించారు. అధికారంలో ఉన్నప్పటికీ ప్రస్తుత మేనిఫెస్టోలో పెట్టిన హామీలను ఎందుకు నెరవేర్చలేదని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్ల పాలనా వైఫల్యానికి ఇది నిదర్శనమని ఫైర్ అయ్యారు. సోమవారం ఢిల్లీలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. 

అహంకారంలో మునిగిన కేసీఆర్ కు గతంలో ఇచ్చిన హామీలు గుర్తుకులేవన్నారు. అవినీతి తప్ప, ప్రజల శ్రేయస్సు, ఇచ్చిన హామీల గురించి ఆలోచించలేదన్నారు. అందుకే ప్రస్తుతం చేజారిపోతున్న అధికారాన్ని కాపాడుకునేందుకు కేసీఆర్ మేనిఫెస్టో రూపంలో విశ్వప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. రైతులు, యువత, మహిళలు, వ్యాపారులు, అన్ని వర్గాలు బీఆర్ఎస్ కు దూరమయ్యారన్నారు.