
దేశ రాజకీయాల్లో మార్పు తెస్తానంటూ వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. రాష్ట్రాల పర్యటన పేరుతో కేసీఆర్ కొత్త డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఇంట్లో లొల్లి అయినప్పుడల్లా దేశ రాజకీయాల పేరుతో ఢిల్లీకి వెళ్తున్న సీఎం కేసీఆర్.. హస్తినలో ఎవరూ పట్టించుకోవడంలేదని సటైర్ వేశారు. తనను కలవాలని నేతలను వేడుకుంటున్నాడని చురకలంటించారు. సీఎం ఎన్ని జిమ్మిక్కులు చేసినా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
అవినీతి మంత్రిని కాపాడేందుకు బీజేపీని బద్నాం చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. డీకే అరుణ, జితేందర్ రెడ్డిలను అన్యాయంగా కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్కు ఓటేస్తే టీఆర్ఎస్కు వేసినట్టేనని సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన వారు టీఆర్ఎస్లోకి వెళ్లిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రపంచం అంతా కాషాయమయం అవుతోందన్న బండి సంజయ్.. ఇతర దేశస్తులు కూడా భారత జెండాతో బయటపడుతున్నారని అన్నారు.
For more news..